గొడవ చేసే ఎంపీలను రెండేళ్లు నిషేధించాలి : అథవాలే

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 10:24 IST

గొడవ చేసే ఎంపీలను రెండేళ్లు నిషేధించాలి : అథవాలే

ముంబయి: పార్లమెంట్‌లో గొడవ సృష్టించే సభ్యులపై రెండేళ్లు నిషేధం విధించాలని, ఈ మేరకు చట్టం తేవాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే ప్రభుత్వాన్ని కోరారు. సభా కార్యక్రమాలకు సాగనీయకుండా విలువైన సమయం, డబ్బును వృథా చేస్తున్నవారిని అడ్డుకోవాలంటే ఇలాంటి చర్యలు తప్పవని అన్నారు. పార్లమెంట్‌లో వివిధ అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉన్నా, విపక్షాలు మాత్రం మూడు రోజుల నుంచి రభస సృష్టించడంపై అథవాలే మండిపడ్డారు. పూర్తి మెజారిటీ ఉన్న మోదీ ప్రభుత్వానికి ఫోన్లు ట్యాప్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దిల్లీ పర్యటనపైనా అథవాలే స్పందించారు. ఎంత మంది ఆమెకు అండగా నిలుచున్నా 2024లో మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన