ఉన్నతవిద్యను ఆపేసి.. కొనసాగించొచ్చు

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 10:30 IST

ఉన్నతవిద్యను ఆపేసి.. కొనసాగించొచ్చు

కొత్తగా ‘అకడమిక్‌ క్రెడిట్స్‌ బ్యాంక్‌’ ఏర్పాటు

యూజీసీ ప్రకటన

ఈనాడు, దిల్లీ: విద్యార్థులు తాము అభ్యసిస్తున్న ఉన్నత విద్యా కోర్సులను మధ్యలో ఆపేసి, మళ్లీ వెసులుబాటు ఉన్నప్పుడు కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కొత్తగా ‘అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ ఇన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల విద్యార్థులు కోర్సులను మధ్యలో ఆపేసి, అప్పటివరకూ ఉన్న క్రెడిట్స్‌ను ఈ బ్యాంకులో దాచుకొని మళ్లీ వీలైనప్పుడు కోర్సులను కొనసాగించవచ్చు. ఈ మేరకు నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా యూజీసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఈ గవర్నెన్స్‌ డివిజన్‌ ఈ అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ వేదికను అభివృద్ధి చేసింది. ఇది విద్యార్థులు తమ క్రెడిట్స్‌ దాచుకొనే డిజీ లాకర్‌లా పనిచేస్తుంది. విద్యార్థులు ఎప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో చేరితే అప్పుడు ఈ ఖాతాను తెరుచుకొని క్రెడిట్స్‌ దాచుకోవచ్చు. వాటిని పరిగణనలోకి తీసుకొని విద్యాసంస్థలు డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా సర్టిఫికెట్లు ప్రదానం చేయొచ్చు. అర్హత ఉన్న అన్ని ఉన్నత విద్యాసంస్థలు, విద్యార్థులు ఈ ‘అకడమిక్‌ బ్యాంక్‌’ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు యూజీసీ తెలిపింది. విద్యాసంస్థలన్నీ ఈ కొత్త విధానం గురించి విద్యార్థులకు చెప్పి అకడమిక్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ తెరుచుకొనేలా ప్రోత్సహించాలని పేర్కొంది. ఈ బ్యాంక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ప్రారంభించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన