15 నుంచి యూపీలో నూతన మంత్రుల పర్యటన

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 10:17 IST

15 నుంచి యూపీలో నూతన మంత్రుల పర్యటన

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు చేరువ కావడానికి భాజపా వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రం నుంచి ఇటీవల కొత్తగా కేంద్ర కేబినెట్‌లో చేరిన ఏడుగురు మంత్రులు 200కు పైగా నియోజకవర్గాల్లో పర్యటించేలా ‘జన్‌ ఆశీర్వాద్‌ యాత్ర’కు శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15 నుంచి వారు ఒకొక్కరు కనీసం 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. వీరితో పాటు కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న వారంతా తమ సొంత రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నాయి. దీనివల్ల తదుపరి ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో తమకు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన