మహారాష్ట్రలో 25 జిల్లాల్లో కొవిడ్‌ నిబంధనల సడలింపు!

ప్రధానాంశాలు

Published : 30/07/2021 06:28 IST

మహారాష్ట్రలో 25 జిల్లాల్లో కొవిడ్‌ నిబంధనల సడలింపు!

 రెండు రోజుల్లో నిర్ణయం

ముంబయి: మహారాష్ట్రలో పాజిటివిటీ రేటు రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉన్న ముంబయి, మరో 24 జిల్లాల్లో కొవిడ్‌ నిబంధనలను సడలించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ సమావేశం అనంతరం తోపే గురువారం విలేకరులతో మాట్లాడారు. పుణె సహా మిగతా 11 జిల్లాల్లో మాత్రం ఇన్‌ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉండటంతో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారిన ముంబయి లోకల్‌ రైళ్లల్లో ప్రయాణాలకు అనుమతించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లోకల్‌ రైళ్లలోకి అనుమతిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ అన్ని అంశాలపైనా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన