జేడీయూ అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌!

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:27 IST

జేడీయూ అధ్యక్షుడిగా లలన్‌ సింగ్‌!

దిల్లీ: జేడీయూ పార్లమెంటు సభ్యుడు రాజీవ్‌ రంజన్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రిమండలి విస్తరణలో జేడీయూ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్‌కు చోటు దొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వైదొలగడంతో రాజీవ్‌కు అధ్యక్ష స్థానం దక్కింది. బిహార్‌లోని ముంగేర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న లలన్‌ భూమిహార్‌ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు అత్యంత నమ్మకస్థుడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన