బలగాలు, ఆయుధాలను సత్వరం ఉపసంహరించాల్సిందే

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:55 IST

బలగాలు, ఆయుధాలను సత్వరం ఉపసంహరించాల్సిందే

చైనాకు తేల్చిచెప్పిన భారత్‌

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌, గోగ్రా సహా వివాదాస్పద ప్రాంతాలన్నింట్లో బలగాలను, ఆయుధాలను చైనా ఉపసంహరించుకోవాల్సిందేనని భారత్‌ తేల్చిచెప్పింది. సరిహద్దు వివాదాలపై శనివారం దాదాపు తొమ్మిది గంటలపాటు జరిగిన 12వ విడత చర్చల్లో ఈ విషయాన్ని స్పష్టంచేసింది. 14 నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలంటే తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ అంశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయమై ఇరు వర్గాలు ప్రధానంగా సమాలోచనలు జరిపాయి. మూడున్నర నెలల విరామానంతరం కోర్‌ కమాండర్ల స్థాయిలో ఈ చర్చలు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి అవతల చైనా భూభాగంలో మోల్డో వద్ద చోటు చేసుకున్నాయి. చర్చలు సమగ్రంగా జరిగాయని ఇరుపక్షాలూ తెలిపాయి. క్షేత్రస్థాయిలో స్థిరత్వం కోసం ఉభయులూ పాటు పడాలని నిర్ణయించినట్లు సమాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన