రైతుల మరణాలపై జేపీసీ వేయాలని రాష్ట్రపతికి వినతి

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:55 IST

రైతుల మరణాలపై జేపీసీ వేయాలని రాష్ట్రపతికి వినతి

దిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలో రైతులు మరణించడంపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేయాలని శనివారం ప్రతిపక్షాలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరాయి. ఆకాలీదళ్‌, ఎన్‌సీపీ, జేకేఎన్‌సీ నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈమేరకు వినతి పత్రం సమర్పించాయి. దీనిపై కాంగ్రెస్‌ మినహా బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు సంతకాలు చేశాయి. అనంతరం అకాలీదళ్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ విలేకరులతో మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా దిల్లీ శివారులో జరుగుతున్న ఆందోళనలో 500 మంది రైతులు మరణించారని తెలిపారు. అయితే ఈ వివరాలేవీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అంటున్నారని చెప్పారు. అందుకే దీనిపై దర్యాప్తు జరపడానికి జేపీసీ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు. పెగాసస్‌ వ్యవహారంపై పార్లమెంటులో చర్చ జరిగేలా కోరామని కూడా చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన