‘భగత్‌సింగ్‌’లా నటించబోతేఉరి పడి ప్రాణంపోయింది!

ప్రధానాంశాలు

Published : 01/08/2021 10:33 IST

‘భగత్‌సింగ్‌’లా నటించబోతేఉరి పడి ప్రాణంపోయింది!

బదాయూ: పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన నటనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేయాలనుకున్నాడు ఆ బాలుడు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌కు ఉరి వేసే సన్నివేశంపై సాధన మొదలు పెట్టాడు. అదే అతని పాలిట శాపంగా మారింది. ప్రమాదవశాత్తు మెడకు ఉరి బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో జరిగింది. కున్వార్‌గావూన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బబత్‌ గ్రామానికి చెందిన భురే సింగ్‌ కుమారుడు శివమ్‌(10) పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి భగత్‌ సింగ్‌ నాటకం రిహార్సల్స్‌లో పాల్గొన్నాడు. భగత్‌సింగ్‌ను ఉరి తీసే సన్నివేశంలో.. శివమ్‌ మెడ చుట్టూ తాడు చుట్టుకున్నాడు. అతను నిల్చున్న స్టూలు పడిపోయి.. మెడకు ఉరి బిగుసుకుంది. అక్కడే ఉన్న విద్యార్థులు భయంతో సాయం కోసం అరవగా.. స్థానికులు పరుగున వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. తాడును కత్తిరించి శివమ్‌ను కిందకు దించారు. కానీ, అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కుటుంబసభ్యులు బాలుడి అంత్యక్రియలు ముగించారు. విషయం తెలుసుకుని కున్వార్‌గావూన్‌ గ్రామానికి వెళ్లగా.. బాలుడి కుటుంబికులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన