భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 05:59 IST

భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్‌

నెల రోజులపాటు బాధ్యతలు

ఐరాస: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న భారత్‌ ఆగస్టు నెలలో అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. ఈ మేరకు ఆదివారం బాధ్యతల స్వీకరణకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష హోదాలో భారత్‌ తొలి అధికారిక పని దినం మాత్రం సోమవారం అవనుంది. సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద నిరోధక అంశాలకు సంబంధించి ఆగస్టు నెలలోనే సంతకాల కార్యక్రమాలు నిర్వహించనుండడం విశేషం. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవం చేసుకుంటున్న నెలలోనే ఐరాస భద్రతా మండలికి నేతృత్వం వహించే అవకాశం రావడం  అద్వితీయమైన గౌరవం’’ అని అందులో పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో 2021-22 కాలానికి సంబంధించి తాత్కాలిక సభ్య దేశంగా భారత్‌ ఎన్నికైన సంగతి తెలిసిందే. మరోవైపు, తన పదవీకాలం చివరి నెలలో అంటే వచ్చే ఏడాది డిసెంబరులో భారత్‌ మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపడుతుంది.

నిబంధనలు పాటించాలి : పాక్‌ ఇస్లామాబాద్‌: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న భారత్‌ అంతర్జాతీయ నియమ నిబంధనలను పాటిస్తుందని భావిస్తున్నట్లు పాకిస్థాన్‌ శనివారం పేర్కొంది. ఈ మేరకు పాక్‌ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన