12 ఏళ్ల బాలునికి గంటపాటు ఉన్నత పదవి

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:55 IST

12 ఏళ్ల బాలునికి గంటపాటు ఉన్నత పదవి

బెంగాల్‌ హక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా 12 ఏళ్ల బాలుడు!

 గంటపాటు ఉన్నత పదవి

కోల్‌కతా: బాల కార్మికునిగా పనిచేసి విముక్తి పొందిన ఓ 12 ఏళ్ల బాలునికి గంట పాటు ఉన్నత పదవిని అనుభవించే అవకాశం దక్కింది. ఆ బాలుడు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించాడు. తల్లిదండ్రులకు తెలియకుండా అక్రమంగా తీసుకొచ్చిన ఆ బాలుడి చేత ఇంటి పనులు చేయిస్తుండగా ఏడేళ్ల కిత్రం చైల్డ్‌లైన్‌ అనే స్వచ్ఛంద సంస్థ పోలీసుల సాయంతో కాపాడింది. అప్పటి నుంచి కొత్త జీవితం ప్రారంభమయింది. బాలల సంరక్షణ గృహంలో ఉంటూ ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. జులై 30 అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా దినాన్ని పురస్కరించుకొని ఆ బాలునికి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే అవకాశాన్ని ఇచ్చింది. ఛైర్‌పర్సన్‌ హోదాలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శశి పంజాకు లేఖ రాశాడు. పిల్లలందరికీ విద్యా సౌకర్యాలు కల్పించాలని, మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన