ఎయిర్‌ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్‌

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:55 IST

ఎయిర్‌ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్‌

అద్దానికి పగుళ్లు రావడంతోనే...

తిరువనంతపురం: సౌదీ వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కేరళలోని తిరువనంతపురంలో శనివారం అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. ఉదయం 7.52 గంటలకు ఇక్కడి నుంచి బయలు దేరిన ఈ విమానం ముందు భాగంలోని అద్దాని(విండ్‌షీల్డ్‌)కి పగుళ్లు వచ్చినట్లు పైలట్‌ గుర్తించారు. గంట అనంతరం  8.50 గంటలకు దాన్ని అత్యవసరంగా తిరువనంతపురంలో ల్యాండింగ్‌ చేశారు. ఆ సమయంలో అందులో పైలట్‌ సహా 8 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.  కరోనా కారణంగా ఆ విమానంలో ప్రయాణికులు లేరని.. కార్గో సేవలకు దీన్ని వినియోగించినట్లు అధికారులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన