ఆర్మీపై అజమాయిషీ సీపీసీదే

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:55 IST

ఆర్మీపై అజమాయిషీ సీపీసీదే

 చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్పష్టీకరణ

బీజింగ్‌: ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధునిక సైనిక శక్తిగా అవతరించాలని, అమెరికా స్థాయిని 2027కల్లా అధిగమించాలని తమ దేశ ఆర్మీ(పీఎల్‌ఏ)కి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నిర్దేశించారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) 94వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. పీఎల్‌ఏపై పూర్తి అజమాయిషీ చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ)దేనని స్పష్టం చేశారు. మరో ఆరేళ్లలో అంటే 2027 ఆగస్టు ఒకటో తేదీకి పీఎల్‌ఏ ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతుంది. ఆ సమయానికి ప్రపంచంలోకెల్లా అగ్రశ్రేణి సైన్యంగా రూపొందాలని చ్కీజిజిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే రక్షణ శాఖకు నిధుల కేటాయింపులను చైనా పెంచుకుంటూ పోతోంది. సీపీసీతో పాటు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ (సీఎంసీ) అధినేతగానూ షీ జిన్‌పింగ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాను జివించి ఉన్నంత కాలం దేశ అధ్యక్ష పదవిలో కొనసాగడంతో పాటు సీపీసీ, సీఎంసీలకు నేతృత్వం వహించే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన