వర్షాకాల సమావేశాల కోతకు నెపం వెతుకుతున్న ప్రభుత్వం

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:55 IST

వర్షాకాల సమావేశాల కోతకు నెపం వెతుకుతున్న ప్రభుత్వం

 ప్రతిష్టంభనకు సర్కారే కారణం: కాంగ్రెస్‌

దిల్లీ: వివిధ వర్గాలపై నిఘాకు వీలు కల్పించే పెగాసస్‌ స్పైవేర్‌ను ఇజ్రాయిల్‌ నుంచి కొన్నారా లేదా అనేది సూటిగా చెప్పలేక పార్లమెంటులో చర్చకు ప్రభుత్వమే అడ్డుపడుతోందని కాంగ్రెస్‌ పేర్కొంది. ముఖ్యమైన అంశాలను తప్పించుకునేలా వర్షాకాల సమావేశాల కుదింపునకు నెపాన్ని వెతుకుతోందని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి ఆరోపించారు. ‘ఇప్పటికి దాదాపు 10 రోజుల పాటు పార్లమెంటు పనిచేయకుండా ప్రభుత్వం అడ్డుపడింది. దీనిని సాకుగా చూపించి సమావేశాలు కుదించడంపై దృష్టి పెట్టింది. అత్యంత ముఖ్యమైన పెగాసస్‌ అంశంపై చర్చకు అంగీకరించకుండా ప్రభుత్వం మంకుపట్టు పడుతోంది. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ స్పైవేర్‌ను కొన్నారా అనే మౌలిక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమివ్వలేదు. ఏదేదో చెబుతూ వస్తోందే గానీ ఈ స్పైవేర్‌ను కొనలేదు అని ఎందుకు ఇతమిత్థంగా సమాధానం చెప్పలేకపోతోంది? ఒకవేళ కొన్నట్లయితే ఎవరెవరిపై దానిని ప్రయోగించారు? దానికెందుకు జవాబివ్వరు?’ అని ప్రశ్నించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన