వచ్చే 4 రోజులు ఉత్తరాదిన అతి భారీ వర్షాలు

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 05:59 IST

వచ్చే 4 రోజులు ఉత్తరాదిన అతి భారీ వర్షాలు

దిల్లీ: ఉత్తరాదితో పాటు మధ్య భారతంతో వచ్చే నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం తెలిపింది. రుతుపవనాల గమనం, అల్పపీడన ప్రాంతాల గుర్తింపు ఆధారంగా.. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తూర్పు రాజస్థాన్‌లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకు ప్రత్యేకంగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రస్తుతం విస్తృతంగా వానలు పడుతున్న జమ్ము- కశ్మీర్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణాలలో ఆగస్టు 4 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన