స్పైవేర్‌ నిఘాపై కొనసాగిన నిరసనలు

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:30 IST

స్పైవేర్‌ నిఘాపై కొనసాగిన నిరసనలు

దిల్లీ: స్పైవేర్‌ నిఘా సహా వివిధ అంశాలపై విపక్షాలు సోమవారం సయితం పార్లమెంటులో నిరసనలు తెలిపాయి. ఆందోళన విరమించి, ప్రజోపయోగ అంశాలను లేవనెత్తాలని స్పీకర్‌ ఓం బిర్లా పలుమార్లు లోక్‌సభలో విజ్ఞప్తి చేశారు. పదేపదే అంతరాయాల వల్ల రూ.కోట్లలో ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్ష ఎంపీల నిరసనల నడుమే ప్రశ్నోత్తరాల సమయాన్ని అరగంటపాటు చేపట్టారు. సభా కార్యకలాపాలను అడ్డుకోకుండా సహకరిస్తే రైతుల అంశాలపై చర్చకు అనుమతించడానికి సుముఖమేనని ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రకటించారు. నిరసనల మధ్యే ఉభయ సభలు కొన్ని బిల్లుల్ని ఆమోదించాయి.

చర్చ జరగాల్సిందే: తృణమూల్‌

పెగాసస్‌ నిఘాపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాల సమక్షంలో పార్లమెంటులో చర్చ జరగాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పార్టీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌ విలేకరులతో మాట్లాడుతూ- పార్లమెంటులో సగటున ఏడు నిమిషాలకొకటి చొప్పున బిల్లుల్ని హడావుడిగా ఆమోదిస్తున్నారని విమర్శించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన