ఇజ్రాయెల్‌ సంస్థ నుంచి కొన్నారా లేదా?

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 06:03 IST

ఇజ్రాయెల్‌ సంస్థ నుంచి కొన్నారా లేదా?

పెగాసస్‌పై చిదంబరం ప్రశ్న

దిల్లీ: ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌వో నుంచి పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారో లేదో చెప్పడానికి కేంద్రం ఎందుకు అంత కష్టపడుతోందని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. ఆ సంస్థకు ప్రభుత్వం క్లయింటో కాదో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘చాలా చిన్న ప్రశ్న. 40 ప్రభుత్వాలు, 60 సంస్థలు తమ క్లయింట్లుగా ఉన్నాయని ఎన్‌ఎస్‌వో పేర్కొంది. అందులో భారత ప్రభుత్వం ఉందా లేదా? ఈ సాధారణ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పడానికి ఎందుకు అంత కష్టపడుతున్నారు’’ అని చిదంబరం అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన