చైనా వరదల్లో 302కి చేరిన మృతుల సంఖ్య

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 06:14 IST

చైనా వరదల్లో 302కి చేరిన మృతుల సంఖ్య

బీజింగ్‌: చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ 302 మంది మృతి చెందారు. ప్రావిన్స్‌ రాజధాని ఝెంగ్‌ఝౌలోనే 292 మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మంది గల్లంతయ్యారు. చైనా సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టింది. జులై 17 నుంచి చైనాలో.. వందల ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ కుండపోత వర్షాలు పడుతున్నాయి. దాదాపు 10 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆ దేశ ప్రచారసాధనాలు పేర్కొన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన