అమెరికా తొందరపడింది.. అందుకే అఫ్గాన్‌లో హింస

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 06:17 IST

అమెరికా తొందరపడింది.. అందుకే అఫ్గాన్‌లో హింస

అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని వ్యాఖ్యలు

కాబూల్‌: అమెరికా తన సేనలను వేగంగా ఉపసంహరించుకోవడమే అఫ్గాన్‌లో హింసకు కారణమని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని అన్నారు. సెప్టెంబర్‌ 11లోపు అఫ్గాన్‌ నుంచి తమ సేనలు వైదొలగుతాయని కొన్నాళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. అయితే ఈ ఉపసంహరణ ప్రక్రియ చాలా వేగంగా సాగింది. దీంతో తాలిబన్లు దూకుడు పెంచారు. చాలా ప్రావిన్స్‌ల్లో జిల్లాలను ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ పార్లమెంటులో ఘని మాట్లాడుతూ.. తాలిబన్లతో సయోధ్య కుదుర్చుకోవాలంటూ అమెరికా తెచ్చిన శాంతి ప్రక్రియను తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ఇది శాంతిని సాధించడంలో విఫలమైందని, దేశంలో గందరగోళాన్ని సృష్టించిందని పేర్కొన్నారు.జిల్లాలకు జిల్లాలు తాలిబన్లు ఆక్రమిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో తమ తఢాఖా చూపిస్తామని ఘని తెలిపారు. అయితే తాలిబన్లను ప్రభుత్వ దళాలు ఎలా నిలువరిస్తాయన్న విషయాన్ని మాత్రం వివరించలేదు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన