అనాథలను ఆదరించడం  అందరి బాధ్యత

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 06:26 IST

అనాథలను ఆదరించడం  అందరి బాధ్యత

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: అనాథలను ఆదుకోవడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతని, వారికీ హక్కులుంటాయనే విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ అనాథల హక్కులు, సామాజిక సాధికారిత సంస్థ వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలో పలువురు అనాథలు ఉప రాష్ట్రపతిని సోమవారం ఆయన నివాసంలో కలిశారు. తమకు హక్కులు కల్పించే చట్టం రూపకల్పనకు సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఉప రాష్ట్రపతి ప్రభుత్వ పెద్దలు, సంబంధిత మంత్రులతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. తన కుమార్తె దీపావెంకట్‌ అనాథలైన అయిదుగురు పిల్లల చదువుసంధ్యలకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా చొరవ తీసుకున్న విషయాన్ని ఉప రాష్ట్రపతి ప్రస్తావించారు.

చట్టబద్ధ హక్కులేవీ..?

అనాథలకు చట్టబద్ధ, రాజ్యాంగపరమైన హక్కులు లేవని గాదె ఇన్నయ్య ఆవేదన చెందారు. పలువురు అనాథలతో కలిసి దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనాథల హక్కుల సాధనలో భాగంగా అన్ని పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యులను కలిసేందుకు దిల్లీ వచ్చామన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలు అందజేసినట్లు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన