నౌకాదళానికి స్వదేశీ శక్తి

ప్రధానాంశాలు

Published : 05/08/2021 04:59 IST

నౌకాదళానికి స్వదేశీ శక్తి

సముద్ర జలాల్లోకి యుద్ధ విమాన వాహక నౌక విక్రాంత్‌

దిల్లీ: భారత నౌకాదళ చరిత్రలో బుధవారం సరికొత్త అధ్యాయం లిఖితమైంది. తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ విమాన వాహక నౌక(ఐఏసీ) విక్రాంత్‌ను సముద్ర జలాల్లో పరీక్షించే ప్రక్రియ ప్రారంభమైంది. తద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ విమాన వాహక నౌకలు ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరిందని నౌకాదళ అధికారులు తెలిపారు. 40 వేల టన్నుల బరువుండే విక్రాంత్‌ దేశంలో నిర్మించిన అతిపెద్ద, సంక్లిష్టమైన యుద్ధ వాహక నౌకగా నిలిచిందని చెప్పారు. సుమారు రూ.23 వేల కోట్ల ఖర్చుతో కొచ్చి షిప్‌యార్డ్‌ దీన్ని నిర్మించింది. దాదాపు 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తు ఉండే ఈ నౌక 30 ఫైటర్‌ జెట్లు, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. దీనిపై అత్యాధునిక మిగ్‌-29కే ఫైటర్‌ జెట్లను, కేఏ-31 హెలికాప్టర్లను మోహరించనున్నారు. వచ్చే ఏడాది ఇది విధుల్లోకి చేరే అవకాశం ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన