Ayodhya: 2023 చివరికల్లా భక్తులకు అయోధ్య రాముడి దర్శనం!

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 08:18 IST

Ayodhya: 2023 చివరికల్లా భక్తులకు అయోధ్య రాముడి దర్శనం!

అప్పటికి గర్భగుడి నిర్మాణం పూర్తి

అయోధ్య: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 2023 చివరికల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి చేసి భక్తుల దర్శనానికి వీలుగా ఆలయ ద్వారాలు తెరవాలని మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు భావిస్తోంది. అప్పటికల్లా గర్భగుడి పనులు పూర్తవుతాయన్న విశ్వాసంతో ఉంది. ‘‘2023 చివరికల్లా మందిర నిర్మాణం పూర్తి చేయాలని అనుకున్నాం. అందుకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. అప్పటికల్లా రాముడిని దర్శించుకొనే భాగ్యం భక్తులకు కలుగుతుంది’’ అని ట్రస్టు వర్గాలు చెబుతున్నాయి. మందిర కాంప్లెక్స్‌లో మిగతా నిర్మాణాలు 2025కి పూర్తవుతాయంటున్నాయి. 

ఆలయ విశేషాలు
* మందిరంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలు ఉంటాయి.
* ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు.
* మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 160, తొలి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి.
*  గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తు ఉంటుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన