జాప్యం మూల్యం రూ. 2,76,971 కోట్లు

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:13 IST

జాప్యం మూల్యం రూ. 2,76,971 కోట్లు

ఈనాడు, దిల్లీ: దేశంలో చేపట్టిన 557 ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరగడంతో వాటి అంచనా వ్యయం రూ.2,76,971 కోట్ల మేర పెరిగినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌సింగ్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కేంద్రం చేపట్టిన 1,737 మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఈ ఏడాది మార్చి 31 నాటికి 462 ప్రాజెక్టుల వ్యయం సాధారణంగా, మరో 557 ప్రాజెక్టుల వ్యయం జాప్యం కారణంగా పెరిగిందన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 77 ప్రాజెక్టుల వ్యయం ధరలు పెరిగిన కారణంగా 38.68%, జాప్యం కారణంగా 27 ప్రాజెక్టుల వ్యయం 55% పెరిగినట్లు వెల్లడించారు. తెలంగాణలో ధరల కారణంగా 47 ప్రాజెక్టుల వ్యయం 8.35%, జాప్యం కారణంగా 15 ప్రాజెక్టుల వ్యయం 4.97% పెరిగిందన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన