కర్ణాటకలో 29 మందితో నూతన మంత్రివర్గం

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:24 IST

కర్ణాటకలో 29 మందితో నూతన మంత్రివర్గం

యడియూరప్ప కుమారుడికి దక్కని అవకాశం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై 29 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కొత్త మంత్రులంతా బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్‌భవన్‌ వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. యడియూరప్ప మంత్రివర్గంలో పని చేసిన వారిలో ఏడుగురిని తొలగించారు. వీరిలో నలుగురు సీనియర్లున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ ముందుగానే తాను బసవరాజ బొమ్మై మంత్రివర్గంలో చేరనని ప్రకటించటంతో ఆయనకు చోటు దక్కలేదు. కొత్త మంత్రివర్గంలో ఐదుగురు కొత్తవారిని చేర్చుకున్నారు. ఈసారి ఉపముఖ్యమంత్రి పదవులు సృష్టించబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. అవినీతి ఆరోపణలున్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు విజయేంద్రను, యడియూరప్ప నాయకత్వాన్ని విమర్శించిన, సమర్థించిన వారెవ్వరినీ కొత్త మంత్రివర్గంలో చేర్చుకోలేదు. కాంగ్రెస్‌, జనతాదళ్‌కు రాజీనామా చేసి భాజపాలోకి చేరిన నేతల్లో ఇద్దరు మినహా అందరికీ కొత్త మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఇంకా నాలుగు ఖాళీలు మిగిలి ఉండగా మరోసారి విస్తరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన