తాలిబన్ల చేతిలోకి లష్కర్‌ గాహ్‌!

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:24 IST

తాలిబన్ల చేతిలోకి లష్కర్‌ గాహ్‌!

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దూకుడు కొనసాగుతోంది. నిన్నమొన్నటివరకు జిల్లాలను ఆక్రమిస్తూ వచ్చిన ఈ ఉగ్రవాద ముఠా.. ప్రావిన్షియల్‌ రాజధానులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. హెల్మాండ్‌ ప్రావిన్స్‌ రాజధాని లష్కర్‌ గాహ్‌లో తాలిబన్లకు ప్రభుత్వ దళాలకు మధ్య భీకరపోరు కొనసాగుతోంది. దాదాపు ఈ నగరం తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి.లష్కర్‌ గాహ్‌ వీధులు మృత దేహాలతో నిండిపోయాయని ఓ అఫ్గాన్‌ అధికారి తెలిపారు. జనాలు బయటికి రావడం లేదని, ఇళ్లల్లోనే ఖైదీలుగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ నుంచి తాలిబన్లను తరిమిగొట్టేందుకు బుధవారం అమెరికా సాయంతో అఫ్గాన్‌ దళాలు భారీయెత్తున వైమానిక దాడులు నిర్వహించాయి. అయితే ఈ దాడి ఏ మేరకు నష్టం కలిగించిందన్న సమాచారం లేదు. లష్కర్‌ గాహ్‌తో పాటు కాబూల్‌, హెరాత్‌ నగరాలను కూడా తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు అఫ్గాన్‌లో అంతర్యుద్ధం కారణంగా ఆ దేశంలో ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ ఐసిస్‌ బలపడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన