భారత్‌ సహా ఇతర దేశాలకు అండగా అమెరికా

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:24 IST

భారత్‌ సహా ఇతర దేశాలకు అండగా అమెరికా

టీకాల ఉత్పత్తిలో సాయం అందిస్తాం: బైడెన్‌

వాషింగ్టన్‌: భారత్‌ సహా ఇతర దేశాలకు కరోనా టీకాల ఉత్పత్తిలో అమెరికా సహాయసహకారాలు అందిస్తుందని అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు 50 కోట్ల డోసులు అందించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ నెలాఖరులో వాటి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. తాము చేసే సాయం పూర్తిగా ఉచితమన్నారు. శ్వేతసౌధంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈమేరకు మాట్లాడారు. కరోనా ఉద్ధృతిని నివారించడంలో ప్రజాస్వామ్య దేశాల కృషి కీలకమన్నారు. కరోనాపై పోరులో టీకాల భాండాగారంగా నిలవాలని అమెరికా సంకల్పించిందన్నారు. కోవాక్స్‌ కార్యక్రమానికి ఇతర దేశాలకన్నా అధికంగా టీకాలు అందించామన్నారు. క్వాడ్‌ కూటమిలోని సహ సభ్య దేశాలైన భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలకు టీకాల ఉత్పత్తిలో సహకారం అందించినట్లు చెప్పారు. 8 కోట్ల డోసుల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఇప్పటివరకూ 65 దేశాలకు 11 కోట్ల డోసులు అందించామన్నారు. అమెరికన్లకు టీకాలు వేయడం, ఇతర దేశాల ప్రజలకు టీకాలు అందడంలో సాయం చేయడం తమ ముందున్న లక్ష్యాలని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన