అఫ్గాన్‌లో ఇస్లామిక్‌ ఎమిరేట్‌ పునరుద్ధరణకు ఐరాస నో

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 06:05 IST

అఫ్గాన్‌లో ఇస్లామిక్‌ ఎమిరేట్‌ పునరుద్ధరణకు ఐరాస నో

ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్థాన్‌లో ‘ఇస్లామిక్‌ ఎమిరేట్‌’ రాజ్యం పునరుద్ధరణకు ఐరాస భద్రతా మండలి తిరస్కరించింది. ఆ దేశంలో తాలిబన్లు యుద్ధానికి దిగి తీవ్రమైన హింసకు పాల్పడుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భద్రతా మండలికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు మండలి అధ్యక్షుని తరఫున భారత రాయబారి శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి పత్రికా ప్రకటన విడుదల చేశారు. దేశంలోని వివాదాలకు మిలటరీ మార్గం పరిష్కారం కాదని చెబుతూ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ పునరుద్ధరణ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ప్రభుత్వం, తాలిబన్లు అర్ధవంతమైన చర్చలు జరపాలని సూచించింది. ఇందులో మహిళలకు భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడింది. అఫ్గానిస్థాన్‌లోని ఐరాస ప్రాంగణంపై గత నెల 30న దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించింది. అఫ్గాన్‌ వ్యవహారాలపై భద్రతామండలి ప్రత్యేకంగా చర్చించాలని ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ హనీఫ్‌ అత్మార్‌ భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌ను కోరుతూ ట్వీట్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన