నగరాల్లో మురుగునీటి శాంపిళ్ల సేకరణ

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:35 IST

నగరాల్లో మురుగునీటి శాంపిళ్ల సేకరణ

కొవిడ్‌ తీవ్రతను గుర్తించే దిశగా చర్యలు

దిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు.. వైరస్‌ కొత్త రకాలేమైనా పుట్టుకొచ్చాయా అన్ని విషయాన్ని నిర్ధారించేందుకు త్వరలో దేశవ్యాప్తంగా మురుగునీటి శాంపిళ్లను సేకరించే ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. వైరస్‌ జన్యుపరమైన మార్పులను గుర్తించేందుకు సార్స్‌-కోవ్‌-2 కన్సార్షియమ్‌ ఆఫ్‌ చ్కీజిజినోమిక్స్‌ (ఇన్సాకాగ్‌) చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ కసరత్తు చేపడుతున్నారు. ఇందులో పలు సంస్థలు, ల్యాబొరెటరీలు భాగస్వామ్యం కానున్నాయి. కొవిడ్‌ మూడో ఉద్ధృతి రావచ్చన్న అంచనాల నేపథ్యంలో దీన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈమేరకు పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన పాయింట్ల నుంచి మురుగునీటి శాంపిళ్లను సేకరిస్తారని వెల్లడించాయి. ముంబయి, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్‌, దిల్లీ సహా పలు నగరాల్లో.. రానున్న కొద్ది వారాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో బయోటెక్నాలచ్కీజీజి విభాగం; శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి, ఐసీఎంఆర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌లకు చెందిన ల్యాబ్‌లు, సంస్థలతో పాటు రాష్ట్రాలు పాలుపంచుకుంటాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన