లోక్‌పాల్‌ ఫిర్యాదులు తగ్గాయి : జితేంద్రసింగ్‌

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:46 IST

లోక్‌పాల్‌ ఫిర్యాదులు తగ్గాయి : జితేంద్రసింగ్‌

దిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోక్‌పాల్‌ ఫిర్యాదులు తగ్గాయని, ఇంది మంచి సంకేతమంటూ ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు తెలిపారు. ఈ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌కు 2019-20లో 1,427 ఫిర్యాదులు రాగా.. ఈ సంఖ్య 2020-21 ఏడాదికి కేవలం 110కి తగ్గగా.. ప్రస్తుత ఏడాది ఇప్పటికి 12 మాత్రమే అందినట్లు వివరించారు. లోక్‌పాల్‌ వ్యవస్థ సక్రమంగా నడిచేలా తగినంత సిబ్బందిని నియమిస్తామని మంత్రి సభకు తెలిపారు.

చైనాతో సైనిక చర్చలు సానుకూలం, నిర్మాణాత్మకం

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌ వివాదంపై ఇటీవల చైనాతో జరిగిన రెండు దేశాల సైనిక చర్చలు పూర్తి నిర్మాణాత్మకంగా సాగాయని, మిగతా అంశాలు కూడా వీలైనంత త్వరగా పరిష్కరించుకునేలా ఉభయులూ అంగీకారానికి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత సైన్యవిభాగం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన