పొరుగుదేశాల ఉన్నతాధికారులకు భారత్‌లో ప్రత్యేక శిక్షణ

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:46 IST

పొరుగుదేశాల ఉన్నతాధికారులకు భారత్‌లో ప్రత్యేక శిక్షణ

దిల్లీ: ఇరుగు పొరుగు దేశాల ఉన్నతస్థాయి అధికారుల (సివిల్‌ సర్వెంట్ల)కు అక్కడి ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు దిల్లీలోని జాతీయ సుపరిపాలన కేంద్రం(ఎన్‌సీజీజీ) సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ విధానాలు, పరిపాలనకు సంబంధించిన అంశాల్లో ఉన్నతాధికారుల సామర్థ్యాలను మరింత ఇనుమడింపజేసేందుకు పలు శిక్షణ కార్యక్రమాలను ఎన్‌సీజీజీ ఇప్పటికే నిర్వహించింది. బంగ్లాదేశ్‌, మాల్దీవులు, మయన్మార్‌, పలు ఆఫ్రికా దేశాలకు చెందిన 2500 మందికిపైగా ఉన్నతాధికారులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి. కొవిడ్‌ విజృంభణ సమయంలో వర్చువల్‌ విధానంలో నిర్వహించిన సదస్సుల్లో 47 దేశాలకు చెందిన 1250 మంది అధికారులు పాల్గొన్నారని ఆ వర్గాలు వివరించాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన