సచిన్‌ వాజేకు బెయిల్‌ నిరాకరణ

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:46 IST

సచిన్‌ వాజేకు బెయిల్‌ నిరాకరణ

ముంబయి: పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనాన్ని ఉంచిన కేసులో.. నిందితుడైన మాజీ పోలీసు ఉన్నతాధికారి సచిన వాజే, అతనికి సహకరించిన రియాజ్‌ క్వాజీలకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు గురువారం బెయిల్‌ నిరాకరించింది. కేసు నమోదై 90 రోజులైనా తమపై ఛార్జ్‌షీట్‌ కాలేదని, అందువల్ల ‘డిఫాల్ట్‌ బెయిల్‌’ ఇవ్వాలని వారు కోరగా కోర్టు తిరస్కరించింది. వారిద్దరిపై ఛార్జిషీట్‌ దాఖలుకు ఎన్‌ఐఏకు మరో నెల రోజుల గడువు ఇచ్చింది.

మహారాష్ట్ర ప్రభుత్వంపై సీబీఐ పిటిషన్‌

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై నమోదైన హవాలా కేసులో తాము చేస్తున్న దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. దేశ్‌ముఖ్‌కు సంబంధించిన పత్రాలను స్థానిక అధికారులు ఇవ్వడం లేదంటూ బోంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన