మూడేళ్లలో 356 పోక్సో ఫిర్యాదులు : స్మృతి ఇరానీ

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:46 IST

మూడేళ్లలో 356 పోక్సో ఫిర్యాదులు : స్మృతి ఇరానీ

దిల్లీ: బాలలపై లైంగిక వేధింపుల నివారణకు ఏర్పాటుచేసిన పోక్సో ఈ-బాక్సుకు దేశవ్యాప్తంగా గత మూడేళ్లతోపాటు ఈ ఏడాది జూన్‌ నాటికి మొత్తం 356 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర స్త్రీశిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభకు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు ఏర్పాటుచేసిన జాతీయ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) సూచన మేరకు ఈ ఆన్‌లైన్‌ ఫిర్యాదుల బాక్సును కేంద్రం అమలులోకి తెచ్చింది. బాధితుల ఫిర్యాదులు నేరుగా కమిషన్‌కు అందేలా చూడటమే దీని ఉద్దేశం.

* కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన సమాచారం సమస్తం ఇకపై పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ రాజ్యసభకు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన