విద్యుత్‌ సవరణ బిల్లును ఉససంహరించుకోవాలి

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:46 IST

విద్యుత్‌ సవరణ బిల్లును ఉససంహరించుకోవాలి

కేరళ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

తిరువనంతపురం: కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లు-2021ని ఉపసంహరించుకోవాలని కేరళ శాసన సభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ బిల్లు వల్ల విద్యుత్‌ రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశం పెరగడంతోపాటు నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడతుందని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. అధికార ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ కూటములు తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర విద్యుత్‌ మంత్రి కె.కృష్ణమూర్తి మాట్లాడుతూ సాధారణంగా విద్యుత్‌ రంగంలో కేంద్ర ప్రమేయం ఉన్నప్పటికీ విద్యుత్‌ పంపిణీ వ్యవహారాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తుంటాయని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్రాలకున్న హక్కులకు భద్రత ఉండేదన్నారు. కానీ సవరణ బిల్లుతో ఆ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రాల ఏకాభిప్రాయాన్ని సాధించడంలో కేంద్రం విఫలమైందన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన