విదేశీ విద్యార్థుల ఇబ్బందులను చైనా దృష్టికి తీసుకెళ్లాం

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:56 IST

విదేశీ విద్యార్థుల ఇబ్బందులను చైనా దృష్టికి తీసుకెళ్లాం

జయ్‌శంకర్‌ వెల్లడి

దిల్లీ: భారత విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించడం కోసం చైనాకు తిరిగి వెళ్లడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌ పేర్కొన్నారు. వారిని చైనాలోకి తిరిగి అనుమతించాలని తమ మంత్రిత్వశాఖ, బీచ్కీజిజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం పలుమార్లు చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే మహమ్మారి నేపథ్యంలో ఆంక్షలు విధించామని వారు బదులిచ్చినట్లు తెలిపారు. వచ్చే సెమిస్టర్‌లోనూ ఆన్‌లైన్‌ ద్వారానే తరగతులు జరుగుతాయని చెప్పారన్నారు. చైనాలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిబంధనలను ఆ దేశం మరింత కఠినతరం చేస్తున్నట్లు చెప్పారు. చైనాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారత విద్యార్థులు.. ప్రయాణ ఆంక్షల కారణంగా చదువును కొనసాగించలేకపోతున్నారని రాజ్యసభ సభ్యుడు ఎం.వి.శ్రేయమ్స్‌ కుమార్‌కు రాసిన లేఖపై జయ్‌శంకర్‌కు ఈ మేరకు బదులిచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన