పార్లమెంట్‌లో రైతుల సమస్యలు లేవనెత్తరా?

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:56 IST

పార్లమెంట్‌లో రైతుల సమస్యలు లేవనెత్తరా?

ప్రాంతీయ పార్టీలకు కిసాన్‌ మోర్చా హెచ్చరిక

దిల్లీ: పార్లమెంట్‌లో పలు బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొంటున్న కొన్ని పార్టీలు.. రైతుల సమస్యలను ఏమాత్రం లేవనెత్తడం లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేయూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము జారీ చేసిన ‘ప్రజా విప్‌’ను తెరాస, వైకాపా, తెదేపా, బీజేడీ, అన్నాడీఎంకే, జేడీయూ తదితర పార్టీలు పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఆయా పార్టీలు తీరు మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించింది. 14 రైతు సంఘాలతో కూడిన ఎస్‌కేయూ దిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలకు పోటీగా జంతర్‌ మంతర్‌ వద్ద ‘కిసాన్‌ సంసద్‌’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో రైతుల సమస్యలు, డిమాండ్లను లేవనెత్తాలంటూ ఇటీవల ఎంపీలు అందరికీ ఎస్‌కేయూ ‘ప్రజా విప్‌’ జారీ చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన