గ్రీన్‌విలేలో కార్చిచ్చు

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:56 IST

గ్రీన్‌విలేలో కార్చిచ్చు

గ్రీన్‌విలే (అమెరికా): ఉత్తర కాలిఫోర్నియాలోని పర్వత నివాస ప్రాంతమైన గ్రీన్‌విలేలో బుధవారం సాయంత్రం పెద్దఎత్తున కార్చిచ్చు అలముకుంది. మంటల్లో ఓ గ్యాస్‌ స్టేషన్‌, హోటల్‌, బార్‌ సహా పలు నిర్మాణాలు ఆహుతయ్యాయి. భారీగా వృక్షసంపద బూడిదైంది. మంటలు ఉత్తరం, తూర్పు వైపుల నుంచి వ్యాపించడంతో సుమారు 800 మంది నివాసితులు తక్షణం ఖాళీ చేయాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గ్రీన్‌విలే ప్రాంతంలో వందేళ్లకు పైబడిన పలు పురాతన భవనాలున్నాయి. కాలిఫోర్నియా గోల్డ్‌ రష్‌ ప్రాంతంగా ఇది ప్రసిద్ధి. మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలోనూ అధిక ఉష్ణోగ్రతలతో అడవులు తగలబడుతున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన