సీబీఐకి ఝార్ఖండ్‌ జడ్జి హత్య కేసు

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:56 IST

సీబీఐకి ఝార్ఖండ్‌ జడ్జి హత్య కేసు

సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్రప్రభుత్వం

దిల్లీ: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన జడ్జి కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో పేర్కొంది. కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని కూడా చెప్పింది. ధన్‌బాద్‌ జిల్లా కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను గత వారం గుర్తు తెలియని వ్యక్తులు ఆటోతో ఢీ కొట్టి హత్య చేశారు. ఈ సంఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌ ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేసింది. హత్య జరిగిన తర్వాత రాష్ట్రంలోని న్యాయమూర్తులకు అదనపు రక్షణ కల్పించామని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన