రెండు డోసులతో మూడింతల రక్షణ!

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:56 IST

రెండు డోసులతో మూడింతల రక్షణ!

లండన్‌: కరోనా మహమ్మారిపై పోరాటంలో టీకాల ఆవశ్యకతను తాజాగా మరో అధ్యయనం నొక్కిచెప్పింది. వ్యాక్సిన్‌ వేయించుకోనివారితో పోలిస్తే.. రెండు డోసులు తీసుకున్నవారు కొవిడ్‌ బారిన పడే ముప్పు మూడు రెట్లు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. టీకా వేయించుకున్నవారు ఒకవేళ మహమ్మారి బారిన పడినా.. వారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపింది. బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ విశ్వవిద్యాలయం, ఇప్సొస్‌ మోరి కంపెనీ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. బ్రిటన్‌లో అందుబాటులో ఉన్న ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా టీకాలు అన్ని కరోనా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన