కొంకణ్‌ రహదారుల మరమ్మతులకు రూ.100 కోట్లు

ప్రధానాంశాలు

Published : 06/08/2021 04:56 IST

కొంకణ్‌ రహదారుల మరమ్మతులకు రూ.100 కోట్లు

దిల్లీ: కొంకణ్‌, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఇటీవల అసాధారణ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇందులో రూ.52 కోట్లు తాత్కాలిక పునరుద్ధరణ పనులకు, రూ.48 కోట్లు శాశ్వత నిర్మాణాలకు కేటాయించామన్నారు. ముంబయి- గోవా జాతీయ రహదారిలో చిప్లున్‌ వద్ద వశిష్టి నదిపై తీవ్రంగా దెబ్బతిన్న వంతెనను 72 గంటల్లోనే పునరుద్ధరించినట్టు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన