పెగాసస్‌పై దర్యాప్తునకు త్వరలో విధివిధానాలు

ప్రధానాంశాలు

Updated : 06/08/2021 06:05 IST

పెగాసస్‌పై దర్యాప్తునకు త్వరలో విధివిధానాలు

ఖరారు చేయనున్న పశ్చిమబెంగాల్‌ ద్విసభ్య సంఘం

కోల్‌కతా: పెగాసస్‌ స్పైవేర్‌పై దర్యాప్తునకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్విసభ్య సంఘం త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి భట్టాచార్య ఆధ్వర్యంలో ఏర్పాటయిన ఈ సంఘం ఉనికిలోకి వచ్చింది. జస్టిస్‌ లోకుర్‌ ఈ వారాంతంలో కోల్‌కతా రానున్నారు. ఆయన వచ్చిన తరువాత విధివిధానాలు ఖరారు చేస్తారు. ఫోన్ల ట్యాపింగ్‌నకు సంబంధించిన వివరాలు ఉంటే 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలంటూ ఇప్పటికే ప్రజానీకాన్ని కోరామని జస్టిస్‌ భట్టాచార్య చెప్పారు. కమిషన్‌కు కార్యాలయం ఏర్పాటయిందని, మరో 10-15 రోజుల్లో అన్ని సౌకర్యాలు సమకూరుతాయని అభిప్రాయపడ్డారు. ప్రజల వాదనలు కూడా వింటామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారన్న అనుమానాలు ఉన్నాయి. ఇందుకు పెగాసస్‌ స్పైవేర్‌గానీ, ఇతరత్రా నిఘా వ్యవస్థను వినియోగించారా అన్నది కూడా దర్యాప్తులో భాగమయ్యే అవకాశం ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన