ముంబయిలో సబర్బన్‌ రైళ్ల సేవల పునఃప్రారంభాన్ని పరిశీలిస్తున్నాం: ఠాక్రే

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

ముంబయిలో సబర్బన్‌ రైళ్ల సేవల పునఃప్రారంభాన్ని పరిశీలిస్తున్నాం: ఠాక్రే

ముంబయి: కరోనా కేసుల ఉద్ధృతి తగ్గడంతో ముంబయిలోని ప్రజానీకానికి సబర్బన్‌ రైళ్ల సేవలను తిరిగి కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. దీనిపై బాధ్యతాయుత నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు చెప్పారు. రెండో ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ముంబయిలో సబర్బన్‌ రైళ్లను నిలిపేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు, అత్యవసర సేవల సిబ్బంది కోసం మాత్రమే వాటిని నడుపుతున్నారు. ముంబయిలో నిర్మించిన పురపాలక భవనం ప్రారంభోత్సవంలో గురువారం ఠాక్రే మాట్లాడారు. నగరంలో కరోనాను అరికట్టడంలో పురపాలక శాఖ విజయం సాధించిందని అభినందించారు. మహమ్మారి సమయంలోనూ ప్రజలకు నిరంతరాయంగా తన సేవలను అందించిందన్నారు. ముంబయిలో కరోనా కట్టడికి అనుసరించిన విధానానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయన్నారు. ధారావి లాంటి అతిపెద్ద మురికివాడలోనూ కరోనాను నిలువరించ గలిగామన్నారు. వీలైనచోట కరోనా నిబంధనలను సడలిస్తామని చెప్పారు. అయితే ప్రజలందరూ కరోనా నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన