విద్యుత్తు ప్రాజెక్టులనిర్మాణంలో జాప్యం

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

విద్యుత్తు ప్రాజెక్టులనిర్మాణంలో జాప్యం

 తద్వారా రూ.72 వేల కోట్ల అదనపు భారం

పార్లమెంటు స్థాయీసంఘం నివేదికలో వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలో నిర్మాణంలో ఉన్న జల, థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంలో ఏళ్ల తరబడి జరిగిన జాప్యం కారణంగా ఆ ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ.72 వేల కోట్ల వరకు పెరిగింది. గురువారం సమర్పించిన నివేదికలో విద్యుత్తు శాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం ఈ విషయాన్ని పేర్కొంది. 13 జల విద్యుత్తు కేంద్రాల్లో 12.. 34 థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో 30 ప్లాంట్ల నిర్మాణం ఆలస్యమైనట్లు పేర్కొంది. అలాగే 42 విద్యుత్తు సరఫరా ప్రాజెక్టుల్లో 18.. 26 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో ఒకటి ఆలస్యమైనట్లు వెల్లడించింది. థర్మల్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో శాంతిభద్రతలు, స్థానిక సంస్థలు, ప్రకృతి వైపరీత్యాలు, మౌలిక వసతుల కొరత, నైపుణ్యవంతమైన మానవ వనరుల కొరత, అటవీ, పర్యావరణ అనుమతులు, తదితర కారణాలు అడ్డంకిగా మారినట్లు పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన