దేశంలో ఆగని కేసుల వెల్లువ

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

దేశంలో ఆగని కేసుల వెల్లువ

 ఒక్కరోజులో 42,982 మందికి కరోనా

533 మంది మృత్యువాత

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 24 గంటల్లో 42,982 కొత్త కేసులు నమోదయ్యాయి. 533 మంది మహమ్మారి దెబ్బకు మృత్యువాత పడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఇంతవరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,18,12,114కు, మరణాల సంఖ్య 4,26,290కి పెరిగింది. క్రియాశీలక కేసులు 4,11,076కు చేరుకున్నాయి. వీటి సంఖ్య ఒక్క రోజులోనే 723 మేర అధికమైంది. మొత్తం ఇన్‌ఫెక్షన్లలో క్రియాశీలక కేసులు 1.29%గా ఉండగా, రికవరీ రేటు 97.37%గా ఉంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,64,030 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంతవరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 47,48,93,363కు పెరిగింది. మహారాష్ట్ర, కేరళల్లో మహమ్మారి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన