200 కోట్ల డోసులు విరాళంగా అందిస్తాం

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

200 కోట్ల డోసులు విరాళంగా అందిస్తాం

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ హామీ

బీజింగ్‌: కరోనా మహమ్మారిపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తామని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ భరోసా ఇచ్చారు. ఈ ఏడాది 200 కోట్ల డోసుల టీకాలను విరాళంగా అందిస్తామని ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలోని కొవాక్స్‌ కూటమికి సుమారు రూ.740 కోట్లు సమకూరుస్తామని కూడా హామీ ఇచ్చారు. కొవిడ్‌-19 టీకా సహకారానికి సంబంధించి గురువారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు జిన్‌పింగ్‌ తన సందేశాన్ని లేఖ రూపంలో పంపించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన