ప్రజల గొంతు నొక్కడానికే పెగాసస్‌

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:31 IST

ప్రజల గొంతు నొక్కడానికే పెగాసస్‌

 ‘సంసద్‌ ఘెరావ్‌’లో రాహుల్‌ గాంధీ ధ్వజం

589 మంది కాంగ్రెస్‌ కార్యకర్తల నిర్బంధం

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ అంశంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రజల గొంతు నొక్కడానికే మోదీ సర్కారు దాన్ని వినియోగిస్తోందని మండిపడ్డారు. పెగాసస్‌ స్పైవేర్‌, నూతన వ్యవసాయ చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలకు వ్యతిరేకంగా యువజత కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం దిల్లీలో నిర్వహించిన సంసద్‌ ఘెరావ్‌(పార్లమెంటు ముట్టడి) కార్యక్రమంలో ఆయన కేంద్రం వైఖరిని దుమ్మెత్తిపోశారు. ఈ దేశ యువత నిజాలు మాట్లాడడం మొదలుపెట్టిన రోజు మోదీ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. సంసద్‌ ఘెరావ్‌లో భాగంగా నిరసన ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు సహా 589 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో జరిగిన తోపులాటలో యువజన కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు శివసేనారెడ్డి కాలుకు దెబ్బ తగలడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన