అఫ్గాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు సరికాదు

ప్రధానాంశాలు

Updated : 16/09/2021 07:41 IST

అఫ్గాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు సరికాదు

తాలిబన్ల డిమాండుకు చైనా దన్ను

బీజింగ్‌: అఫ్గానిస్థాన్‌పై ఆర్థికవనరుల పరమైన ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలన్న తాలిబన్ల డిమాండుకు వారి మిత్రదేశం చైనా మద్దతు పలికింది. అలా ఆంక్షలు విధించే అధికారం అమెరికాకు లేదని వ్యాఖ్యానించింది. అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమిర్‌ఖాన్‌ ముత్తఖిని, తాలిబన్లు ఏర్పాటుచేసిన మధ్యంతర ప్రభుత్వాన్ని బుధవారం కాబుల్‌లోని చైనా ఎంబసీ రాయబారి అభినందించారు. నివేదికల ప్రకారం.. అఫ్గానిస్థాన్‌ సెంట్రల్‌ బ్యాంకుకు చెందిన 950 కోట్ల అమెరికన్‌ డాలర్లను (రూ.69,828 కోట్లు) బైడెన్‌ ప్రభుత్వం స్తంభింపజేసింది. తాలిబన్ల ప్రభుత్వం వనరులు ఉపయోగించుకోకుండా కాబుల్‌కు ఉన్న ఆర్థిక మార్గాలను మూసివేసింది. అఫ్గాన్‌ ఆస్తులపై అమెరికా ఇలా పెత్తనం చేయడం తగదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జావ్‌ లిజియన్‌ బీజింగ్‌లో మీడియా ఎదుట వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన