అదనపు బలగాలు పంపండి: భాజపా

ప్రధానాంశాలు

Published : 16/09/2021 05:39 IST

అదనపు బలగాలు పంపండి: భాజపా

దిల్లీ: ఉప ఎన్నికల్లో ఓటర్లను బెదిరించి గెలిచేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని భాజపా ఆరోపించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి భవానీపుర్‌లో నెగ్గేందుకు ఆమె చూస్తున్న దృష్ట్యా స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం వీలైనంత ఎక్కువగా భద్రత బలగాలను అక్కడకు పంపించాలని కోరింది. ఈ మేరకు పార్టీ నాయకులు- లాకెట్‌ ఛటర్జీ, స్వపన్‌ దాస్‌గుప్తా తదితరుల బృందం బుధవారం దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రిపై, రకరకాల వ్యాఖ్యలు చేసిన మరికొందరు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరింది.


ఎన్నికల హింస కేసులో మమత ఏజెంటుకు సీబీఐ సమన్లు

మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికల అనంతర హింసకు సంబంధించి మమతా బెనర్జీ ఎన్నికల ఏజెంట్‌ షేక్‌ సూఫియాన్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. హింసలో చోటు చేసుకున్న మరో హత్య కేసునూ సీబీఐ స్వీకరించింది. దీంతో ఇప్పటివరకు ఇలాంటి 35 కేసుల్ని సీబీఐ నమోదు చేసినట్లయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన