పాకిస్థాన్‌కు దేశ రక్షణ రహస్యాలు

ప్రధానాంశాలు

Updated : 16/09/2021 07:45 IST

పాకిస్థాన్‌కు దేశ రక్షణ రహస్యాలు

డీఆర్‌డీవో కేసు దర్యాప్తులో వెల్లడి

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌లోని డీఆర్‌డీవో నుంచి రక్షణ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో అరెస్టు చేసిన నలుగురు ఉద్యోగులను బుధవారం కోర్టుకు తరలించారు. ఈమేరకు తూర్పు ప్రాంత ఐజీ హిమాంశులాల్‌ మాట్లాడుతూ... ‘డీఆర్‌డీవోలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌)లో ఏసీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న బసంత బెహరా, షేక్‌ ముషాఫిర్‌, డీజీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న హేమంతకుమార్‌ మిస్త్రీ, ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది తపస్‌ రంజన్‌నాయక్‌లు ఐటీఆర్‌కు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్‌కు అందజేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయి. వారిని బాలేశ్వర్‌ పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరపగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం రాత్రి ఐజీ హిమాంశు లాల్‌, బాలేశ్వర ఎస్పీ సుధాంశు శేఖర్‌ మిశ్రా నేతృత్వంలో ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు సోదాలు చేసి నిందితులను అరెస్టు చేశాయి. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. వారు విదేశాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు, మూడు రోజులపాటు నలుగురిపై నిఘా ఉంచారు. రూఢీ చేసుకున్నాక అరెస్టు చేసి, దేశద్రోహం కేసు పెట్టారు. రహస్యాలు అందించినందుకు వీరికి భారీ మొత్తాలు అందాయి. వారి బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఘటనలో మరికొందరికి సంబంధాలు ఉన్నాయి. వారి కోసం గాలిస్తున్నాం’ అని వివరించారు. మరోవైపు డీజీపీ అభయ్‌ ఆదేశాల మేరకు క్రైమ్‌బ్రాంచ్‌ ఎస్పీ ప్రశాంత్‌ కుమార్‌ బిశోయ్‌ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం బాలేశ్వర్‌ చేరుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన