మెరుగైన రీతిలో సంక్షేమ పథకాల అమలుకు మంత్రుల బృందం..

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:26 IST

మెరుగైన రీతిలో సంక్షేమ పథకాల అమలుకు మంత్రుల బృందం..

రాజ్‌నాథ్‌ నేతృత్వంలో ఏర్పాటు

దిల్లీ: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు; మైనారిటీలు, మహిళలకు ఉద్దేశించిన వివిధ సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అమలయ్యేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వం వహిస్తున్న ఈ బృందం గురువారం తొలిసారిగా సమావేశమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌ సహా కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బృందం ఏర్పాటు కావడం విశేషం. కేంద్ర విద్యామంత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా ఇన్‌-ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ మంత్రుల బృందంలో ఉన్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, అర్జున్‌ ముండా, కిరణ్‌ రిజిజులు సభ్యులుగా ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు ఇందులో సభ్యులుగా ఉన్నప్పటికీ తొలి సమావేశానికి హాజరు కాలేకపోయారు. వివిధ సంక్షేమ పథకాలపై సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన