సోనూసూద్‌ ఆస్తులపై మూడో రోజూ ఐటీ సోదాలు

ప్రధానాంశాలు

Updated : 18/09/2021 16:02 IST

సోనూసూద్‌ ఆస్తులపై మూడో రోజూ ఐటీ సోదాలు

ముంబయి: ప్రముఖ నటుడు సోనూసూద్‌ నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ శుక్రవారం కూడా సోదాలు కొనసాగించింది. ముంబయిలోని ఆరు ప్రాంతాల్లో ఆయనకు ఆస్తులున్నాయని గుర్తించడంతో పాటు వాటి ప్రాంగణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. స్థిరాస్తి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలతో సూద్‌కు సంబంధాలున్నాయని ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు. సోనూసూద్‌, ఆయన సన్నిహితుల నివాస ప్రాంగణాల్లో బుధవారం ప్రారంభమైన ఈ సోదాలు లఖ్‌నవూ సహా మరికొన్ని నగరాలకూ విస్తరించినట్లు సమాచారం.

కరోనా తొలి దశ లాక్‌డౌన్‌ సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన సోనూసూద్‌ను పేదల ఆపద్బంధు అంటూ భాజపా ప్రశంసించిందని శివసేన అధికార పత్రిక సామ్నా..సంపాదకీయంలో గుర్తు చేసింది. దిల్లీ, పంజాబ్‌ ప్రభుత్వాలు సామాజిక కార్యక్రమాల్లో సోనూసూద్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవగా ఇప్పుడు ఐటీ శాఖతో దాడులు చేయిస్తోందని మండిపడింది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన