పోలీస్‌ బదిలీల రద్దుకు రూ.40 కోట్ల లంచం

ప్రధానాంశాలు

Published : 18/09/2021 04:59 IST

పోలీస్‌ బదిలీల రద్దుకు రూ.40 కోట్ల లంచం

మహారాష్ట్ర మంత్రి, మాజీలపై ఆరోపణలు
ఈడీ ఎదుట వాజే వాంగ్మూలం

ముంబయి: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాల వాహనం నిలిపిన కేసులో ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న ముంబయి మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, రవాణాశాఖ మంత్రి అనిల్‌ పరాబ్‌ల గురించి కీలక విషయాలు వెల్లడించారు. అప్పటి పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ 2020 జులైలో 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను రద్దు చేసేందుకు డీసీపీల నుంచి నాటి మంత్రులిద్దరూ రూ.40 కోట్ల లంచం తీసుకున్నట్లు ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో వాజే తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన